Tuesday, 3 January 2017

4. ऊकालोज्झ्रस्वदीर्घप्लुतः (1-1-26)
उश्च ऊश्च उ3श्च वः। वां काल इव कालो यस्य सोच् क्रमाद्-ह्रस्वदीर्घप्लुतसंज्ञः स्यात्। स प्रत्येकमुदात्तादिभेदेन त्रिधा।
ऊकालःअच्ह्रस्वदीर्घप्लुतः అని పదవిభాగము. అచ్చులు హ్రస్వదీర్ఘప్లుతములు అని మూడు రకాలు, ఇందులో ప్రతి భేదము ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని మూడు గా విభక్తమవుతుంది. అంటే హ్రస్వము - హ్రస్వ ఉదాత్తము, హ్రస్వ అనుదాత్తము, హ్రస్వ స్వరితము అని విభక్తమవుతుంది అలాగే మిగిలినవి కూడా. ఇందులో ప్రతి ఒక్క భేదము అనునాసికము, అననునాసికము అని విభక్తమవుతుంది. హ్రస్వ ఉదాత్త అనునాసికము, హ్రస్వ ఉదాత్త అననునాసికము, హ్రస్వ అనుదాత్త అనునాసికము, హ్రస్వ అనుదాత్త అననునాసికము, హ్రస్వ స్వరిత అనునాసికము, హ్రస్వ స్వరిత అననునాసికము అని మొత్తము 6 రకాలుగా విభక్తమవుతుంది. ఇలాగే అనుదాత్త స్వరితాలు కాడా ఆరు ఆరు రకాలుగా విభక్తమవుతుంది. మొత్తము ఒక్కో అచ్చు 18 రకాలుగా విభక్తమవుతుంది. 
ప్రస్తుతము ఈ సూత్రముతో అచ్చులకు హ్రస్వదీర్ఘప్లుత అనే సంజ్ఞలను విధిస్తచున్నారు. సూత్రములో ఊ అంటే ఉ ఊ ఉ3 ల సమాహారము అని అర్ధము, సమాహారద్వంద్వము. ఈ మూడు కలిపి ఊ అని అయింది. ఉకారమును ఉచ్చరించడానికి ఏకమాత్రాకాలము పడుతుంది, కాబట్టి దాన్ని హ్రస్వము అంటారు. అంటే ఏకమాత్రాకాలిక ఉచ్చారణ కలిగిన ఏ అచ్చునైనా హ్రస్వము అంటారు. అలాగే ఊకారమును ఉచ్చరించడానికి ద్విమాత్రాకాలము పడుతుంది, దాన్ని దీర్ఘము అంటారు, ద్విమాత్రాకాలిక ఉచ్చారణ కలిగిన ఏ అచ్చునైనా దీర్ఘము అంటారు, 3 ఉచ్చరించడానికి త్రిమాత్రాకాలము పడుతుంది, దీన్ని ప్లుతము అంటారు, త్రిమాత్రాకాలిక ఉచ్చారణ కలిగిన అచ్చును ప్లుతము అంటారు.
5. उच्चैरुदात्तः (1-2-29)
ताल्वादिषु सभागेषु स्थानेषूर्ध्वभागे निष्पन्नोजुदात्तसंज्ञः स्यात्। 
उच्चैः, उदात्तः అని పదవిభాగము, ऊकालोज्झ्रस्वदीर्घप्लुतः అను సూత్రమునుండి అచ్ అనే పదమనువృత్తమవుతుంది. అకారాది అచ్చులను కంఠము, తాలువు మొదలయిన స్థానములనుండి ఉచ్చరిస్తాము. ఈ స్థానాలలో పైభాగము, క్రిందభాగము అని రెండు భాగాలుంటాయి.వీటిలో పైభాగమునుండి ఉచ్చరించే అచ్చులు ఉదాత్తములు.
6. नीचैरनुदात्तः (1-2-30)
स्पष्टम्।
తాల్వాదిస్థానములలో క్రింది భాగం నుండి ఉచ్చరించే అచ్చులు అనుదాత్తములు.
7. समाहारः स्वरितः (1-2-31)
उदात्तत्वानुदात्तत्वे वर्णधर्मौ समाह्रियेते यस्मिन् सोच् स्वरितसञ्ज्ञः स्यात्। 
ఉదాత్తధర్మము, అనుదాత్తధర్మముల కలయిక స్వరితము. అనగా స్వరితవర్ణమున మొదటిభాగము ఉదాత్తాంశము, ద్వితీయభాగము అనుదాత్తాంశము ఉంటాయి.

No comments:

Post a Comment