Wednesday, 4 January 2017

హ్రస్వ అకారము ప్రయోగించునపుడు సంవృతము, ప్రక్రియాదశలో వివృతము అను విషయము సూత్రకారుడైన పాణిని వలన జ్ఞాపకము చేయబడినది. అది ఎట్లనిన –
11. अ अ
विवृतमनूद्य संवृतोऽनेन विधीयते। अस्य चाष्टाध्यायीं सम्पूर्णां प्रत्यसिद्धत्वाच्छास्त्रदृष्ट्या विवृतमस्त्येव। तथा चसूत्रम्।

ఈ సూత్రముతో వివృతమునకు సంవృతమును విధించారు. అష్టాధ్యాయి లో ఇది చివరి సూత్రము. కాబట్టి ఇది సంపూర్ణ అష్టాధ్యాయి దృష్ట్యా అసిద్ధము. ఈ అసిద్ధము అనేది కేవలము వ్యాకరణశాస్త్రానికి సంబంధించినది కాబట్టి వివృతానికి సంవృతాన్ని విధించడమనేది శాస్త్రములోనే అసిద్ధము, అందువలన ప్రక్రియాదశ లో అకారము వివృతమే ఉంటుంది.  ప్రయోగదశలో లేదు కాబట్టి ప్రయోగమునందలి అకారము సంవృతము.
అచ్చు హల్లులకు పరస్పరము సవర్ణనిషేధవిధానసూత్రము చెప్పబడుతుంది.
अकारहकारयोरिकारशकारयोर्ऋकारषकारयोर्कारसकारयोश्च मिथः सावर्ण्ये प्राप्ते
అకారహకారముల స్ధానప్రయత్నములు సమానము కాబట్టి (స్థానము – కంఠము, ప్రయత్నము - వివృతము) పూర్వము చెప్పిన ‘तुल्यास्य प्रयत्नम् सवर्णम्’ అనే సూత్రము తో అకారహకారమలు సవర్ణములవుతుండగా అదేవిధంగా ఇకారశకారములు (స్థానము – తాలువు, ప్రయత్నము - వివృతము), ఋకారషకారములు (స్థానము – మూర్ధ, ప్రయత్నము - వివృతము), కారసకారములు (స్థానము – దంతము, ప్రయత్నము - వివృతము) ఒకదానికొకటి పరస్పరసవర్ణములు అవుతుండగా ప్రస్తుతసూత్రము ప్రారంభింపబడెను.
13. नाज्झलौ 1-1-10
आकारसहितोच् आच्, स च हल् चेत्येतौ मिथः सवर्णौ न स्तः। तेन दधीत्यस्य हरति, शीतलं, षष्ठं, सान्द्रमित्येतेषु परेषु यणादिकं न।
न, आज्झलौ అని పదవిభాగము. आसहितः अच् आच्। आच् च हल् च आज्झलौ। అని సమాసము. ఆచ్ అంటే ఆకారసహితమైన అచ్ (ఆ అచ్ - ఆచ్) అని అర్థము. ఆజ్ఝలౌ అంటే ఆకారము, అచ్ ప్రత్యాహారవర్ణాలు, హల్ ప్రత్యాహారవర్ణాలు అని అర్థము. అదే విషయము ను భట్టోజీ దీక్షితులు వృత్తిలో ప్రసంగిస్తున్నారు.
ఆకారము అచ్ వర్ణాలున్ను హల్వర్ణములకు పరస్పరము సవర్ణములు కావు. అందువల్ల దధి అనే పదానికి హరతి, శీతలం, షష్ఠం, సాన్ద్రం అనేవి పరమైనపుడు యణాదేశాది సంధులు జరుగవు.
దధి హరతి అని ఉండగా, హకారము అకారము సవర్ణములే కనుక అయితే దధి లోని అంత్యమందున్న ఇకారమునకు అ(హ)కారము పరమున్నది కాబట్టి యణాదేశము జరగాల్సింది. కానీ అలా జరగడం లేదు. అలాగే దధి శీతలం, శకారము ఇకారము సవర్ణములయితే దధి లోని ఇకారమునకు ఇ(శ)కారము పరంగా ఉంది కాబట్టి రెంటికి సవర్ణదీర్ఘము జరగాలి. దధి షష్ఠం, ఇక్కడ ష-ఋ సమానవర్ణాలయితే ఇకారానికి ఋవర్ణము పరంగా ఉంది కాబట్టి యణాదేశం జరగాలి. దధి సాన్ద్రం, ఇందులో స- లు పరస్పరము సవర్ణాలయితే యణాదేశము జరుగవలసింది. అలా ఎక్కడ యణాదేశసవర్ణాలు జరుగడం లేదు. అచ్చులకు హల్లులు సవర్ణములు కాదు కాబట్టి ఈ యణాదేశాదులు జరుగవు.
अन्यथा दीर्घादीनामिव ग्रहणकशास्त्रबलादच्त्वं स्यात्।
హకారాదులు అచ్చులు కాదు కదా మరి యణాదేశము ఎలా సంభవిస్తుంది అంటే, హల్లులు కనుక అచ్చులకు సవర్ణాలయితే, अणुदित्सवर्णस्य चाप्रत्ययः అనే సూత్రంతో, అణ్ ప్రత్యాహారవర్ణాలు ఎలా అయితే తమ సవర్ణాలయిన దీర్ఘాదులను గ్రహిస్తాయో, అలానే హకారాదులను కూడా గ్రహిస్తే హకారాదులకు అచ్త్వము వస్తుంది.
तथा हि
ముందు సూత్రములో గ్రాహకశాస్త్రప్రసంగము వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్రాహకసూత్రము ప్రసంగిస్తున్నారు.
ఇప్పుడు అనునాసికము అంటే ఏమిటో వివరిస్తున్నారు.
9. मुखनासिकावचनोऽनुनासिकः
मुखसहितनासिकयोच्चार्यमाणो वर्णोऽनुनासिकसंज्ञः स्यात्। तदित्थम् - अ इ उ ऋ एषां वर्णानां प्रत्येकमष्टादश भेदाः। ऌवर्णस्य द्वादश, तस्य दीर्घाभावात्। एचामपि द्वादश, तेषां ह्रस्वाभावात्।
ముఖనాసికావచనః, అనునాసికః అని పదవిభాగము. 
ముఖము (నోరు)ను ముక్కును కలిపి ఉచ్చరించే వర్ణాలను అనునాసికవర్ణాలు అంటారు. అంటే నోటితో పాటు నాసికను కూడా ఉపయోగించి ఏ వర్ణములను ఉచ్చరిస్తామో అవి అనునాసికవర్ణములు.  
ఇప్పుడు మొత్తము అచ్చులలో ఏవేవి ఎన్ని రకాలో చెప్తున్నారు. అ ఇ ఉ  ఋ అనే అచ్చులు 18 రకాలు. అంటే ఈ నాలుగింటి లో ఒక్కొక్కదానికి ఇప్పటి వరకు చెప్పిన 18 రకాలభేదాలు ఉన్నవి, సంస్కృతం లో దీర్ఘ వర్ణము ఉండదు. దీర్ఘము లేకపోతే దానికి సంబంధించిన భేదాలు(6) ఉండవు, కాబట్టి  12 భేదాలు. 
హ్రస్వమునకు 6 భేదాలు(ఉదాత్తానునాసికము, ఉదాత్తాననునాసికము, అనుదాత్తానునాసికము, అనుదాత్తాననునాసికము, స్వరితానునాసికము, స్వరితాననునాసికము), దీర్ఘమునకు 6 భేదాలు, ఫ్లుతములకు 6 భేదాలు ఉంటాయి కాబట్టి ఈ మాడింటి లో ఏ భేదం లేకపోయినా, దానికి సంబంధించిన 6 భేదాలు ఉండవు.
ఏచ్ ప్రత్యాహారములోని ఏ, , , ఔ లకు హ్రస్వము లేదు, కాబట్టి హ్రస్వభేదాలు (6) ఉండవు, అందువల్ల వీటికి కూడా 12 భేదాలే ఉన్నాయి.

10.
तुल्यास्यप्रयत्नं सवर्णम्
ताल्वादिस्थानमाभ्यन्तरप्रयत्नश्चेत्येतद्द्वयं यस्य येन तुल्यं तन्मिथः सवर्णसंज्ञं स्यात्।
తుల్యాస్యప్రయత్నం, సవర్ణం అని పదవిభాగము.
తాలువు, కంఠము మొదలైన స్థానములు, ప్రయత్నమున్ను ఏ రెండు వర్ణములకు సమానమో అవి ఒకదానికొకటి సవర్ణములు.
సవర్ణసంజ్ఞకోసం స్థానములు, ప్రయత్నములు ఏవో తెలుసుకోవాలి కాబట్టి స్థనప్రయత్నములను చెప్తున్నారు.ఇప్పుడు వర్ణముల ఉచ్చారణస్థానములు చెప్పబడుచున్నవి.
अकुहविसर्जनीयानां कण्ठः।
అకారము, కవర్గ (క,,,,ఙ), , విసర్గ వీటికి ఉచ్చారణస్థానము కంఠము.
इचुयशानां तालु।
ఇకారము, చవర్గ (చ,,,,ఞ), , శ వీటికి ఉచ్చారణస్థానము తాలువు.
ऋटुरषाणां मुर्धा।
ఋకారము, టవర్గ (ట,,,,ణ), , ష వీటికి ఉచ్చారణస్థానము మూర్ధ.
ऌतुलसानां दन्ताः।
ఌకారము, తవర్గ (త,,,,న), , స వీటికి ఉచ్చారణస్థానము దంతాలు.
उपूपध्मानीयानामोष्ठौ।
ఉకారము, పవర్గ (ప,,,,మ), ఉపధ్మానీయము (,  లకు ముందుండే అర్ధవిసర్గ) వీటికి ఉచ్చారణస్థానము పెదవులు.
ञमङणनानां नासिका च।
,, , , న వీటికి ముక్కు కూడా ఉచ్చారణస్థానము. అంటే ఇవి వర్గపంచమాక్షరాలు కాబట్టి ఆవర్గకు ముందు చెప్పిన కంఠము మొదలైన ఉచ్చారణస్థానములతో పాటు నాసిక కూడా ఉచ్చారణస్థానము. అంటే ఙ కు కంఠము,నాసికా ఉచ్చారణస్థానములు.
एदैतोः कण्ठतालु।
ఏకారమునకు, ఐకారమునకు ఉచ్చారణస్థానము కంఠతాలువు.
ओदौतोः कण्ठोष्ठम्।
ఓకారములకు, ఔకారమునకు ఉచ్చారణస్థానము కంఠోష్ఠము.
वकारस्य दन्तोष्ठम्।
వకారమునకు ఉచ్చారణస్థానము దంతోష్ఠము.
जिह्वामूलीयस्य जिह्वामूलम्।
జిహ్వామూలీయమునకు (,  లకు ముందున్న అర్ధవిసర్గ)ఉచ్చారణస్థానము జిహ్వామూలము.
नासिकानुस्वारस्य। इति स्थानानि।
అనుస్వారముకు ఉచ్చారణస్థానము ముక్కు. ఇవి స్థానములు.
यत्नो द्विधा - आभ्यन्तरो बाह्यश्च। आद्यश्चतुर्धा - स्पृष्टेषत्स्पृष्टविवृतसंवृतभेदात्। तत्र स्पृष्टं प्रयतनं स्पर्शानाम् ईषत्स्पृष्टमन्तःस्थानाम्। विवृतमूष्मणां स्वराणां च। ह्रस्वस्यावर्णस्य प्रयोगे संवृतम्। प्रक्रियादशायां तु विवृतमेव। एतच्च सूत्रकारेण ज्ञापितम्।
యత్నము రెండు రకాలు. ఒకటి ఆభ్యన్తరము, మరొకటి బాహ్యము. ఆభ్యన్తరప్రయత్నము అంటే వర్ణము ముఖము నుండి బయటకు వచ్చే ముందు లోపల జరుగు ప్రయత్నము. ఆభ్యన్తరము అంటే లోపల అని అర్థము. బాహ్యము అంటే బయట అని అర్థము. ఇది వర్ణములు నోటి నుండి బయటకు వచ్చునపుడు జరుగును.
ఆభ్యన్తరప్రయత్నము 4 రకాలు. 1. స్పృష్టము, 2. ఈషత్ స్పృష్టము, 3. వివృతము, 4. సంవృతము అని.
వర్ణములను ఉచ్చరించునపుడు నాలుక తాల్వాదిస్థానములను స్పృశించినచో స్పృష్టము అని, కొంచెము తాకిన ఈషత్స్పృష్టమని, వర్ణోచ్చారణమున ముఖము  తెరుచుకొనిన వివృతమని, కొంచెము తెరుచుకొనిన ఈషద్వివృతమని అర్థము. 
స్పర్శవర్ణములనుచ్చరించునపుడు జరుగు ఆభ్యంతరప్రయత్నము స్పృష్టము. అక్షరసమామ్నాయములో క నుండి మ వరకు ఉన్న వర్ణములకు స్వర్శలు అని పేరు.
అన్తఃస్థవర్ణములనుచ్చరించునపుడు ఈషత్స్పృష్టము అనే ఆభ్యంతరప్రయత్నము జరుతుంది. య, , , ల కు అన్తఃస్థము అని పేరు.
స్వరవర్ణములను, ఊష్మవర్ణములను ఉచ్చరించునపుడు జరుగు ఆభ్యంతరప్రయత్నము వివృతము. స్వరములు అనగా అచ్చులు. ఊష్మవర్ణములు శ, , , హ.

హ్రస్వమైన అకారముప్రయోగించునపుడు (భాషలో, పరినిష్ఠితదశలో)సంవృతము, ప్రక్రియదశలో అంటే   వ్యాకరణప్రక్రియాదశలో వివృతము. రామః అని ప్రయోగించునపుడు ఇందలి అకారము సంవృతము. రామ + ఆలయః అని ప్రక్రియాదశలో మాత్రము వివృతము..
8. तस्यादित उदात्तमर्धह्रस्वम्।
ह्रस्वग्रहणमतन्त्रम्। स्वरितस्यादितोर्धमुदात्तं बोध्यम्। उत्तरार्धं तु परिशेषादनुदात्तम्। तस्य चोदात्तस्वरितपरत्वे श्रवणं स्पष्टम्। अन्यत्र तूदात्तश्रुतिः प्रातिशाख्ये प्रसिद्धा।
తస్య, ఆదితః, ఉదాత్తమ్, అర్ధహ్రస్వమ్. అని పదవిభాగము. తస్య అంటే స్వరితస్య అని అర్థము. పూర్వసూత్రముతో స్వరితము అంటే ఏమిటో చెప్పారు (ఉదాత్తఅనుదాత్తాల సమాహారము), ఈ సూత్రముతో స్వరితములో ఎంతభాగము ఉదాత్తముంటుంది, ఎంత భాగము అనుదాత్తముంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. సూత్రములో హ్రస్వగ్రహణము అప్రధానము. 
స్వరితమైన అచ్చులో మొదటి సగభాగము ఉదాత్తము, మిగిలిన సగభాగము అనుదాత్తము ఉంటాయి. దీనివలన హ్రస్వదీర్ఘఫ్లుతములలో పూర్వమందున్న అర్ధభాగము ఉదాత్తము, మిగిలినభాగము అనుదాత్తము అవుతాయి.
ఆ అనుదాత్తము (ఉత్తరభాగమందున్న అనుదాత్తము) ఉదాత్తము గానీ, స్వరితము గానీ పరముగా ఉన్నపుడే వినిపిస్తుంది, మిగిలినపుడు (ఉదాత్తస్వరితములు పరముగాలేనపుడు)పూర్వమందున్న ఉదాత్తము వినిపించడం ప్రాతిశాఖ్యము లో ప్రసిద్ధము.
क्व १ वोश्वाः, रथानां न ये२ ऽराः। शतचक्रं यो ३ ह्यः మొదలైన వాటిలో అనుదాత్తము వినిపిస్తుంది. क्व १ वोश्वाः, ఇందులో క్వ అనేది స్వరితము(పూర్వభగము ఉదాత్తము ఉత్తరభాగము అనుదాత్తము)వో అనేది ఉదాత్తము. ఇక్కడ స్వరితమునకు ఉదాత్తము పరముగా ఉన్నది కాబట్టి ఉత్తరభాగమందున్న అనుదాత్తము యొక్క ఉచ్చారణ వినిపిస్తుంది. 
अग्निमीले इत्यादावुदात्तश्रुतिः। అగ్నిమ్ ఈలే అనే ఉదాహరణలో ఈలే లోని  స్వరితము, దీని తర్వాత ఉన్న లే ఏకశృతి, కాబట్టి స్వరితము లోని ఉత్తరభాగమందున్న అనుదాత్తము వినిపించదు(ఉదాత్తము కానీ స్వరితము కానీ పరముగా లేదు కాబట్టి), పూర్వభగమందున్నఉదాత్తమే వినిపిస్తుంది.
स नवविधोपि प्रत्येकमनुनासिकाननुनासिकत्वाभ्यां द्विधा।
అచ్చు ఇప్పటికి తొమ్మిది రకాలుగా చెప్పబడింది, ఇవి మరలా అనునాసికము, అననునాసికము అని రెండు రకాలు.
హ్రస్వము, దీర్ఘము, ఫ్లుతము అనేవి ఒక్కొక్కటి ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని మూడుగా విభక్తమయినాయి(3x3=9). మరలా ఇవి ఒక్కొక్కటి అనునాసికము, అననునాసికము అని రెండుగా విభక్తమయినాయి -  
హ్రస్వ ఉదాత్తము, హ్రస్వ అనుదాత్తము, హ్రస్వ స్వరితము. మరలా ఇవి అనునాసికము, అనునాసికము అని రెండు రకాలు. కాబట్టి
హ్రస్వ-ఉదాత్త-అనునాసికము, హ్రస్వ-ఉదాత్త-అననునాసికము; హ్రస్వ-అనుదాత్త-అనునాసికము, హ్రస్వ-అనుదాత్త-అననునాసికము; హ్రస్వస్వరిత-అనునాసికము, హ్రస్వస్వరిత-అననునాసికము. ఇవి మొత్తము 6 భేదాలు.
ఈ విధముగా హ్రస్వము, దీర్ఘము, ఫ్లుతము ఒక్కొక్కటి ఆరు రకాలుగా విభక్తమవుతుంది.