హ్రస్వ అకారము
ప్రయోగించునపుడు సంవృతము, ప్రక్రియాదశలో వివృతము అను విషయము సూత్రకారుడైన పాణిని వలన
జ్ఞాపకము చేయబడినది. అది ఎట్లనిన –
11. अ अ
विवृतमनूद्य संवृतोऽनेन विधीयते। अस्य चाष्टाध्यायीं
सम्पूर्णां प्रत्यसिद्धत्वाच्छास्त्रदृष्ट्या विवृतमस्त्येव। तथा चसूत्रम्।
ఈ సూత్రముతో వివృతమునకు
సంవృతమును విధించారు. అష్టాధ్యాయి లో ఇది చివరి సూత్రము. కాబట్టి ఇది సంపూర్ణ
అష్టాధ్యాయి దృష్ట్యా అసిద్ధము. ఈ అసిద్ధము అనేది కేవలము వ్యాకరణశాస్త్రానికి
సంబంధించినది కాబట్టి వివృతానికి సంవృతాన్ని విధించడమనేది శాస్త్రములోనే అసిద్ధము, అందువలన ప్రక్రియాదశ లో
అకారము వివృతమే ఉంటుంది. ప్రయోగదశలో లేదు కాబట్టి ప్రయోగమునందలి అకారము సంవృతము.
అచ్చు హల్లులకు పరస్పరము
సవర్ణనిషేధవిధానసూత్రము చెప్పబడుతుంది.
अकारहकारयोरिकारशकारयोर्ऋकारषकारयोर्ऌकारसकारयोश्च मिथः
सावर्ण्ये प्राप्ते
అకారహకారముల స్ధానప్రయత్నములు సమానము
కాబట్టి (స్థానము – కంఠము, ప్రయత్నము - వివృతము) పూర్వము చెప్పిన ‘तुल्यास्य प्रयत्नम् सवर्णम्’ అనే సూత్రము తో అకారహకారమలు సవర్ణములవుతుండగా
అదేవిధంగా ఇకారశకారములు (స్థానము – తాలువు, ప్రయత్నము - వివృతము), ఋకారషకారములు
(స్థానము – మూర్ధ, ప్రయత్నము - వివృతము), ऌకారసకారములు (స్థానము –
దంతము, ప్రయత్నము - వివృతము) ఒకదానికొకటి పరస్పరసవర్ణములు అవుతుండగా ప్రస్తుతసూత్రము
ప్రారంభింపబడెను.
13. नाऽऽज्झलौ 1-1-10
आकारसहितोऽच् आच्, स च हल् चेत्येतौ मिथः सवर्णौ न स्तः।
तेन दधीत्यस्य हरति, शीतलं, षष्ठं, सान्द्रमित्येतेषु परेषु यणादिकं न।
न, आज्झलौ అని పదవిభాగము. आसहितः अच् आच्। आच् च हल् च आज्झलौ। అని సమాసము. ఆచ్ అంటే
ఆకారసహితమైన అచ్ (ఆ అచ్ - ఆచ్) అని అర్థము. ఆజ్ఝలౌ అంటే ఆకారము, అచ్ ప్రత్యాహారవర్ణాలు,
హల్ ప్రత్యాహారవర్ణాలు అని అర్థము. అదే విషయము ను భట్టోజీ దీక్షితులు వృత్తిలో ప్రసంగిస్తున్నారు.
ఆకారము అచ్ వర్ణాలున్ను
హల్వర్ణములకు పరస్పరము సవర్ణములు కావు. అందువల్ల దధి అనే పదానికి హరతి, శీతలం,
షష్ఠం, సాన్ద్రం అనేవి పరమైనపుడు యణాదేశాది సంధులు జరుగవు.
దధి హరతి అని ఉండగా,
హకారము అకారము సవర్ణములే కనుక అయితే దధి లోని అంత్యమందున్న ఇకారమునకు అ(హ)కారము
పరమున్నది కాబట్టి యణాదేశము జరగాల్సింది. కానీ అలా జరగడం లేదు. అలాగే దధి శీతలం, శకారము
ఇకారము సవర్ణములయితే దధి లోని ఇకారమునకు ఇ(శ)కారము పరంగా ఉంది కాబట్టి రెంటికి
సవర్ణదీర్ఘము జరగాలి. దధి షష్ఠం, ఇక్కడ ష-ఋ సమానవర్ణాలయితే ఇకారానికి ఋవర్ణము పరంగా
ఉంది కాబట్టి యణాదేశం జరగాలి. దధి సాన్ద్రం, ఇందులో స-ऌ లు పరస్పరము
సవర్ణాలయితే యణాదేశము జరుగవలసింది. అలా ఎక్కడ యణాదేశసవర్ణాలు జరుగడం లేదు. అచ్చులకు హల్లులు
సవర్ణములు కాదు కాబట్టి ఈ యణాదేశాదులు జరుగవు.
अन्यथा दीर्घादीनामिव ग्रहणकशास्त्रबलादच्त्वं
स्यात्।
హకారాదులు అచ్చులు కాదు
కదా మరి యణాదేశము ఎలా సంభవిస్తుంది అంటే, హల్లులు కనుక అచ్చులకు సవర్ణాలయితే, अणुदित्सवर्णस्य चाप्रत्ययः అనే సూత్రంతో, అణ్
ప్రత్యాహారవర్ణాలు ఎలా అయితే తమ సవర్ణాలయిన దీర్ఘాదులను గ్రహిస్తాయో, అలానే
హకారాదులను కూడా గ్రహిస్తే హకారాదులకు అచ్త్వము వస్తుంది.
तथा हि
ముందు సూత్రములో
గ్రాహకశాస్త్రప్రసంగము వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్రాహకసూత్రము ప్రసంగిస్తున్నారు.