Tuesday, 3 January 2017

1. हलन्त्यम् (1-3-3)   

हल् (मा.सू 14) इति सूत्रे अन्त्यमित्स्यात्।

  14 మాహేశ్వరసూత్రాలలో చివరి సూత్రమైన హల్ అనే సూత్రములోని అంత్యవర్ణమునకు ఇత్ అని పేరు. అష్టాధ్యాయి లో ఈ సూత్రము ఒకటే ఉంది కానీ సిద్దాంతకౌముది లో రెండుసార్లు ఉంది. ఇక్కడ ఒకసూత్రముతో హల్ అనే మాహేశ్వరసూత్రములోని చివరి లకారమునకు ఇత్సంజ్ఞ విధిస్తున్నారుఇంకొక సూత్రము తో ఉపదేశమునందున్న చివరి హల్లుకు ఇత్సంజ్ఞ విధిస్తున్నారు.



2.आदिरन्त्येन सहेता (1-1-71)
अन्त्येन इता सहित आदिर्मध्यगानां स्वस्य च संज्ञा स्यात्।
  ఇది ప్రత్యాహారసంజ్ఞావిధాయకసూత్రము. ఆదిఃఅన్త్యేనసహఇతా ఇని పదవిభాగము. సూత్రము సంపూర్ణార్ధమును చెప్పటం కోసము సూత్రములలో లేని కొన్నిపదములను వేరే సూత్రములనుండి తీసుకొచ్చి సంపూర్ణార్ధముని చెప్తారు. దీనినే అనువృత్తి అంటారు. ఈ సూత్రములోకి  స్వం రూపం శబ్దస్యాశబ్దసంజ్ఞా అనే సూత్రమునుండి స్వం అనే పదమనువృత్తి అవుతుంది. అంతమందున్న ఇత్సంజ్ఞావర్ణముతో కలిసి మొదటి వర్ణము మధ్యలో ఉన్న వర్ణములకూతనకూ సంజ్ఞ అవుతుంది. 
   ఉదాహరణకు - అణ్ అనేది అ ఇ ఉ లకు సంజ్ఞ. अइउण् అనే సూత్రములోని ఇత్సంజ్ఞ అయిన ణ్మొదటి వర్ణమైన అ తో కలిసి అణ్ అనే ప్రత్యాహారమైనది. ఇది అ ఇ ఉ అను వర్ణసముదాయమునకు పేరు. అ లుంది ణ్ మధ్యలో ఉన్న ప్రతిమర్ణముకు అణ్ అని పేరుఅలాగే అ కు కూడా అణ్ అని పేరు. ణ్ కి మాత్రము ఇందులో ప్రవేశముండదు. ఇత్సంజ్ఞ కు సర్వదా లోపము జరుగుతుంది. 
   అదేవిధముగా एच् అనే ప్రత్యాహారము एओङ లోని ऐऔच् లోని च् తో కలిపితే ఏర్పడింది. దీనివల్ల ఏ కి ఏచ్ అని పేరుఓ కి ఏచ్ అని పేరుఐ కి ఏచ్ అని పేరుఔ కి ఏచ్ అని పేరు. ఏ వర్ణమైనా కాని అది ఏ ప్రత్యాహారము లో ఉంటే అదే పేరుతో పిలువబడుదుంది. ఉదాహరణకు అక్ ప్రత్యాహారములో ఉన్నపుడు అ కు అక్ అని పేరుఅచ్ ప్రత్యాహారములో ఉన్నపుడు అ చు అచ్ అని పేరుఅట్ ప్రత్యాహారములో ఉన్పుడు అ కు అట్ అని పేరు. ఇదేవిధముగా మిగిలిన ప్రత్యాహారాలు కూడా సిద్ధిస్తాయి.


हलन्त्यम्
उपदेशे अन्त्यं हल् इत् स्यात्। उपदेश आद्योच्चारणम्। ततः अण्अच् इत्यादिसञ्ज्ञासिद्धौ। 
   హల్అన్త్యమ్ అని సూత్రవిభాగము. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే  సూత్రమునుండి ఉపదేశేఇత్ అనే పదాలు అనువృత్తమవుతాయి. ఉపదేశమున అంత్యమందున్న హల్లుకు ఇత్ అని పేరు. ఉపదేశములు - ధాతువులుసూత్రములుగణములుఉణాదులులింగానుశాసనముఆగమాలుప్రత్యయాలుఆదేశాలు. వీటిలో చివరి హల్లుకు ఇత్ అని పేరు. కాబట్టి మాహేశ్వరసూత్రములలోని చివరి హల్లులకు కూడా ఇత్ అని పేరు.అందువల్ల అణ్అచ్ అని ప్రత్యాహారాలు సిద్ధించాయి. ఈ సూత్రము రెండుసార్లు చెప్పబడింది.

3. उपदेशे अजनुनासिक इत् (1-3-2)
उपदेशेनुनासिकोजित्संज्ञः स्यात्।
  उपदेशेअच्अनुनासिकः इत् అని పదవిభాగము. ఉపదేశమునందు అనునాసికమైన అచ్చుకు ఇత్సంజ్ఞ అవుతుంది. అనునాసికత్వము ఇప్పుడు మృగ్యము కాబట్టి ఏక్కడైతే అచ్చుకు ఇత్సంజ్ఞ చేస్తున్నామో అక్కడ అనునాసికత్వము అని గ్రహించాలి. అందుకే प्रतिज्ञनुनासिक्याः पाणिनीयाः అని చెప్తున్నారు.లణ్ (మా.సూ 6) సూత్రములోని అవర్ణమునకు ఇత్సంజ్ఞ అని కొందరి అభిప్రాయము. దానితో हयवरट् లోని రేఫను కలిపి ఉచ్చరిస్తే రప్రత్యాహారమవుతుంది. రప్రత్యాహారము రలకు సంజ్ఞ. 

   प्रत्याहारेष्वितां न ग्रहणम्। ప్రత్యాహారాలలో ఇత్సంజ్ఞలకు గ్రహణము లేదు. అంటే అక్ ప్రత్యాహారంలోఅ ఇ ఉలలాగా ణ్ కి గ్రహణముండదు. 

No comments:

Post a Comment